ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను వెంటనే నిలిపి వేయాలి' - ఉపాధ్యాయుల సంఘల సమాఖ్య

కర్నూలులో టీచర్లు ధర్నా చేశారు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను వెంటనే నిలిపివేసి.. బదిలీల షెడ్యూలును ప్రకటించాలని డిమాండ్ చేశారు.

teachers protest in kurnoolteachers protest in kurnool
ఉపాద్యాయుల అక్రమ బదిలీలను వెంటనే నిలిపి వేయాలి

By

Published : Jul 15, 2020, 6:25 PM IST

ఉపాధ్యాయుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కర్నూలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట టీచర్లు ధర్నా చేశారు. అక్రమంగా జరుగుతున్న బదిలీలను వెంటనే నిలిపివేసి నిబంధనల ప్రకారం షెడ్యూలును ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాజకీయ సిఫార్సులు ఉన్న వారికే బదిలీల్లో న్యాయం జరుగుతోందని ఆరోపించారు. నాడు నేడు కార్యక్రమంలో ఉపాధ్యాయులకు పాఠశాలల అభివృద్ధి పనుల పర్యవేక్షణ మాత్రమే ఉండాలని... కాంట్రాక్టు పనులు, ఇసుకను ఆన్ లైన్ లో బుక్ చేసే పనులు చేయించరాదని కోరారు.

ABOUT THE AUTHOR

...view details