కర్నూలు జిల్లా కోడుమూరు హంద్రీ నదిలో ఇసుక తరలింపు యథేచ్ఛగాకొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ అక్రమార్కులు రాత్రింబవళ్లు ట్రాక్టర్లలలోఇసుకనుఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా వేకువజామున ఎడ్ల బండ్లపై తరలించడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. హంద్రీ నదిలో నీటి పథకాలు దగ్గర ఇసుకనూ తవ్వేస్తున్నారు. హంద్రీ ఒడ్డున ఆనుకొని ఉన్న పొలాల్లో ఇసుకను రాత్రివేళలో తరలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.