Arrest Of A Gang Smuggling Liquor: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో అక్రమ మద్యం సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు ప్రాంతంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా..భారీగా టెట్రా ప్యాకెట్లు బయటపడ్డాయి. సుమారు 4,992 టెట్రా ప్యాకెట్లను గుర్తించామని పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా డోన్‌కు చెందిన గంగాధర్ గౌడ్, సురేంద్ర గౌడ్లను సెబ్ సీఐ శేషాచలం అదుపులోకి తీసుకున్నారు. మద్యాన్ని తరలించేందుకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన మద్యమంతా కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
కర్నూలు జిల్లా సరిహద్దులో అక్రమ మద్యం పట్టివేత - Illegal supply of liquor latest news
Arrest Of A Gang Smuggling Liquor: అక్రమ మద్యం సరఫరా చేస్తున్న ఓ ముఠాను కర్నూలు జిల్లా సరిహద్దులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా తరలించారని అధికారులు తెలిపారు.

అక్రమ మద్యం సరఫరా
కర్నూలు జిల్లా సరిహద్దులో అక్రమ మద్యం పట్టివేత
Last Updated : Dec 18, 2022, 12:16 PM IST