కర్నూలు జిల్లా ఆదోనిలో టాటా మ్యాజిక్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటకకు చెందిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేయటంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 288 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆదోనిలో పోలీసులు తనిఖీలు..288 మద్యం బాటిళ్లు స్వాధీనం - ఆదోనిలో మద్యం పట్టివేత వార్తలు
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని.. వారి వద్ద నుంచి 288 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆదోనిలో అక్రమ మద్యం పట్టివేత
ఆదోనిలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గణేకల్ గ్రామానికి చెందిన అంజనేయ టాటా మ్యాజిక్ వాహనాన్ని కొనుగోలు చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా సీటు కింది భాగంలో మద్యాన్ని ఉంచి.. సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి