టైర్ పంచర్ దుకాణంలో ఇబ్రహీం అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించాడు. పని పూర్తైందనుకొని టైర్ కింద రాయిని తొలగించడంతో లారీ ఇబ్రహీం పైకి ఎక్కేసింది. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు.
ibrahim death by larry tire
By
Published : Jul 8, 2019, 9:26 AM IST
లారీ టైరు ఎక్కి వ్యక్తి మృతి...
కర్నూలు జిల్లా నంద్యాల నూనెపల్లె లో ఓ పంచర్ దుకాణంలో జరిగిన ప్రమాదంలో ఇబ్రహీం అనే వ్యక్తి మరణించాడు. లారీ టైర్లకు గాలి నింపి పూర్తిగా పనిఅయిందనుకున్న సమయంలో టైర్లకు కింద ఉన్న రాయిని తొలగించాడు. లారీ కదిలే క్రమంలో రాయిని తీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. గతంలో రెండు ప్రమాదాల నుంచి ఇబ్రహీం బయటపడినా... ఈ ప్రమాదం అతని కుటుంబంలో విషాదం నింపింది.