ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Hydrographic Survey: శ్రీశైలం జలాశయంలో పూడికపై సర్వే

శ్రీశైలం జలాశయంలో ముంబైకి చెందిన 12 మంది నిపుణులు హైడ్రోగ్రాఫిక్‌ సర్వే చేపట్టారు. ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నిల్వ నిర్దారణ, పూడిక ఏ మేరకు చేరిందో గుర్తించేందుకు సర్వే జరుగుతోందని జలాశయ ఇంజినీర్లు పేర్కొన్నారు.

Hydrographic Survey at srihsilam
శ్రీశైలంలో పూడికపై హైడ్రోగ్రాఫిక్‌ సర్వే

By

Published : Aug 22, 2021, 8:28 AM IST

శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న నీరు, పూడికపై హైడ్రోగ్రాఫిక్‌ సర్వే జరుగుతోంది. ముంబైకి చెందిన 12 మంది నిపుణులు శనివారం సర్వే చేశారు. బోటుపై నుంచి పరికరాలను నీటిలోకి పంపి పూడిక ఎంత చేరిందో తేల్చేందుకు చర్యలు చేపట్టారు. శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో నీటినిల్వ 308.62 టీఎంసీలుగా ఉండగా 2009 వరద తర్వాత 215.807 టీఎంసీలకు పడిపోయింది. అప్పట్లో అనూహ్యంగా వచ్చిన వరదలతో శ్రీశైలం జలాశయం దాదాపు 93 టీఎంసీల నీటి నిల్వను కోల్పోయింది.

తెలుగు రాష్ట్రాల జలాశయాల నిర్వహణను కృష్ణా బోర్డు అధీనంలోకి తీసుకోనున్న నేపథ్యంలో ప్రస్తుత నీటి నిల్వను మరోసారి నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ సర్వే చేస్తున్నారు. గడిచిన పదేళ్లలో శ్రీశైలం జలాశయంలో పూడిక ఏ మేరకు చేరిందో గుర్తించేందుకు సర్వే జరుగుతోందని జలాశయ ఇంజినీర్లు పేర్కొన్నారు. 15 రోజులపాటు ఈ సర్వే కొనసాగుతుందని, ఇక్కడ పూర్తి కాగానే కర్నూలు పరిసర ప్రాంతాల్లో సర్వే చేస్తారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details