ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హత్య చేసి పొలంలో పాతిపెట్టాడు.. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు! - kurnool crime latest news

కర్నూలు జిల్లా హోళగుంద మండలం మునుమానుగుందే గ్రామంలో కట్టుకున్న భర్తే భార్యను చంపి పొలంలో పూడ్చిపెట్టిన సంఘటన కలకలం రేపింది. భార్యపై అనుమానంతో తలపై కొట్టి చంపాడా భర్త. కొన్నాళ్లకు అతని తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.

husband murders his wife
భార్యను హత్య చేసి పోలంలో పాతిపెట్టాడు

By

Published : Jun 30, 2020, 1:07 AM IST

కట్టుకున్న భార్యపై అనుమానంతో బసవరాజ్ అనే వ్యక్తి... మీనాక్షి అలియాస్ వీణ అనే మహిళను తలపై కొట్టి చంపిన దుర్ఘటన కర్నూలు జిల్లా మునుమానుగుందే గ్రామంలో జరిగింది. పదేళ్ల క్రితం బసవరాజు, మీనాక్షిలకు వివాహం జరిగింది. వీరికి అయిదేళ్ల కుమారుడు ఉన్నాడు. తర్వాత భార్యపై అనుమానంతో నిత్యం ఇద్దరి మధ్య గొడవలు జరిగుతుండేవి.

ఈనెల మొదట్లో భార్యను చంపి పొలంలో పూడ్చి పెట్టిన భర్త తనకు ఏమీ తెలియనట్లుగా తన కుమారుడితో అత్తమామలకు ఫోన్ చేసి అమ్మతో మాట్లాడాలి ఫోన్ ఇవ్వమని అడిగించాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు నల్గొండ పోలీస్ స్టేషన్​లో 17న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా భార్యను హత్య చేసి, తన పొలంలోనే పూడ్చి పెట్టినట్లు తేల్చారు. వైద్యులను పిలిపించి పోలీసుల సమక్షంలో శవ పరీక్షలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details