దేవనకొండ మండలం తేర్నేకల్ గ్రామంలో నివసిస్తున్న బోయ మాదన్న.. కట్టుకున్న భార్యను హతమార్చాడు. బోయ మాదన్నకు ఐదేళ్లక క్రితం గోగులపాడుకు చెందిన లలిత(26)తో వివాహం జరిగింది. మాదన్నకు ఇది రెండో పెళ్లి. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. గురువారం అర్ధరాత్రి భార్య లలితపై విచక్షణారహితంగా కొట్టడం వల్ల మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. హత్యకు గల కారణాలను ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భార్యను హతమార్చిన భర్త..
కట్టుకున్న భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్నూలు జిల్లా తేర్నేకల్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితుడు బోయ మాదన్న పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
భార్య లలితను హత్య చేసిన భర్త మాదన్న