కర్నూలు జిల్లా అవుకు మండల కేంద్రంలో.. భార్య మొహరూన్నీసపై భర్త ఉస్మాన్ భాషా విచక్షణా రహితంగా గొడ్డలితో దాడి చేశాడు. బాధితురాలి మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను బనగానపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల తీసుకువెళ్లారు.
పిలవగానే పుట్టింటి నుంచి రాలేదని... భార్యపై గొడ్డలితో దాడి - పుట్టింటి నుంచి రాలేదని అవుకులో భార్యపై భర్త గొడ్డలితో దాడి
కొన్ని రోజులు పుట్టింట్లో ఉండి బయలుదేరదామని అడిగిన మహిళపై ఆమె భర్త విచక్షణా రహితంగా గొడ్డలితో దాడికి దిగాడు. కర్నూలు జిల్లా అవుకు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని నంద్యాలలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
![పిలవగానే పుట్టింటి నుంచి రాలేదని... భార్యపై గొడ్డలితో దాడి husband attack on wife with axe at avuku](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11046529-296-11046529-1615983091347.jpg)
అవుకులో భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త
ఉస్మాన్ భాషా గొడ్డలి దాడిలో గాయపడిన భార్య మొహరూనిస
ఈ దంపతులకు ఐదు రోజుల కిందట కుమారుడు జన్మించి మృతిచెందాడు. సొంత గ్రామమైన బనగానపల్లి మండలం నందవరం నుంచి అవుకు వచ్చిన ఉస్మాన్ భాషా.. బాలింతగా ఉన్న భార్యను ఊరికి వెళ్దామని అడిగాడు. మరికొన్ని రోజులు ఉండి వెళ్దామని ఆమె చెప్పగా ఆగ్రహించిన భర్త.. గొడ్డలితో దాడికి దిగాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:గుండెపోటుతో బనగానపల్లె సీడీపీవో మృతి