కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి, తలపై రాయితో మోదాడు. అనంతరం తానూ గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. పట్టణంలోని తెలుగుపేటకు చెందిన బాలరాజు కత్తితో తన భార్య గొంతు కోసి తలపై బలంగా కొట్టాడు. అదే కత్తితో బాలరాజు గొంతు కోసుకున్నాడు. స్థానికులు వారిని నంధ్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబకలహాలతోనే ఈ విధంగా చేసినట్లు భర్త బాలరాజు తెలిపాడు.
భార్యను బండరాయితో మోది.. భర్త ఆత్మహత్యాయత్నం - కర్నూలు జిల్లా నేర వార్తలు
కర్నూలు జిల్లాలో కుటుంబకలహాలతో ఓ భర్త తన భార్య గొంతుకోసి, తలపై బండతో మోది తాను కత్తితో కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
![భార్యను బండరాయితో మోది.. భర్త ఆత్మహత్యాయత్నం husband attack on his wife and committed suicide in kurnool dst nandyala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8388026-534-8388026-1597212988922.jpg)
husband attack on his wife and committed suicide in kurnool dst nandyala