ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం - శ్రీశైలంలో నీటి ప్రవాహం వార్తలు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నీటినిల్వ 77.3446 టీఎంసీలుగా నమోదైంది. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి... 38,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్​కు విడుదల చేస్తున్నారు.

huge inflow of water to srisailam dam
పెరుగుతున్న శ్రీశైలం జలాశయం నీటిమట్టం

By

Published : Jul 23, 2020, 1:14 PM IST

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి స్థిరంగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి 56,389 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే 71,355 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుకుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 848.80 అడుగులుగా ఉంది. జలాశయం నీటినిల్వ 77.3446 టీఎంసీలుగా నమోదైంది. ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి... 38,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్​కు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details