ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం ఆలయ హుండీకి రూ.4.90కోట్లు ఆదాయం - srisailam latest news

శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీశైలం ఆలయ హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. కేవలం 16 రోజుల్లోనే రూ.4.90కోట్లు సమకూరినట్లు దేవస్థానం ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు.

huge income collected to srisailam hundi in kurnool district
శ్రీశైలం ఆలయ హుండీకి రూ.4.90కోట్లు ఆదాయం

By

Published : Mar 18, 2021, 10:40 PM IST

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల ఆలయ హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.4.90 కోట్లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 16 రోజుల్లో ఈ మొత్తం ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. ఈనెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగడంతో ఈ మేరకు ఆదాయం వచ్చిందని కేఎస్ రామారావు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details