ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gold seize: పంచలింగాల చెక్​పోస్ట్​ వద్ద బంగారం పట్టివేత - kurnool crime

కర్నూలు సరిహద్దులోని పంచలింగాల చెక్​పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారం ఆభరణాలను ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం బంగారాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు.

huge gold seized at panchalilngala chekpost at kurnool
పంచలింగాల సరిహద్దు వద్ద భారీగా బంగారం పట్టివేత

By

Published : Jun 12, 2021, 6:05 PM IST

కర్నూలులోని ఓ బంగారం దుకాణంలో పనిచేసే సత్యనారాయణ... హైదరాబాద్ నుంచి ఒక కేజీ 818 గ్రాముల బంగారు అభరణాలను ఓ ప్రైవేటు బస్సులో తీసుకువస్తున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు కర్నూలు సరిహద్దులోని పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ సుమారు రూ.1.80కోట్లు ఉంటుందని ఎస్​ఈబీ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. బంగారు ఆభరణాలను సీజ్ చేసి తాలూకా పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details