ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వం ఇచ్చిన స్థలాల నుంచి పంపించేస్తారా?' - ఎమ్మిగనూరులో ఇళ్ల స్థలాల బాధితుల ధర్నా వార్తలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పేదల గుడిసెలు తొలగించిన ప్రాంతాన్ని జనసేన నియోజకవర్గ బాధ్యురాలు రేఖగౌడ్ పరిశీలించారు. బాధితులను పరామర్శించారు.

house victims protest at emmiganoor
ఎమ్మిగనూరులో ఇళ్ల స్థలాల బాధితుల ధర్నా

By

Published : Jul 2, 2020, 5:53 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రెండు దశాబ్దాల క్రితం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేశారు. ఆ ప్రాంతంలోని బాధితులను జనసేన నియోజకవర్గ బాధ్యురాలు రేఖగౌడ్ పరామర్శించారు. కూల్చిన గుడిసెలను కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. బాధితులతో కలిసి ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో వేసుకున్న గుడిసెలను తొలగించడం అన్యాయమని ఆమె మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details