ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మీ కాళ్లు మొక్కుతాం.. గుడిసెలు తొలగించొద్దు' - ఎమ్మిగనూరు వార్తలు

'సారో మీ కాళ్లు మొక్కుతాం.. మా గుడిసెలు తొలగించొద్దంటూ' కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇంటి పట్టాదారులు మంగళవారం ఆందోళన చేపట్టారు.

Emiganoor
ఎమ్మిగనూరులో ఇంటి పట్టాదారులు ఆందోళన

By

Published : Jun 24, 2020, 8:39 AM IST

Updated : Jun 24, 2020, 8:50 AM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివన్ననగర్‌లో పేదలు వేసుకున్న దాదాపు 100 గుడిసెలను పట్టణ సీఐ ప్రభాకర్‌రెడ్డి, తాలుకా సీఐ మహేశ్వరరెడ్డి, పురపాలక కమిషనర్‌ రఘునాథ్‌రెడ్డి సమక్షంలో మంగళవారం తొలగించారు. కొందరు లబ్ధిదారులు సీఐ కాళ్లు పట్టుకొని ‘మా స్థలాలు మాకు ఇప్పించండి’ అని వేడుకున్నారు. ఆందోళన చేస్తున్న పట్టాదారులను పోలీసులు బలవంతంగా మినీ లారీలో పోలీసుస్టేషన్‌కు తరలించారు. తెదేపా హయాంలో 1999లో మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి సమక్షంలో 50 ఎకరాల్లో 964 పట్టాలను వీరికి పంపిణీ చేశారు. ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో పట్టాలను అధికారులు రద్దు చేసినట్లు తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు ప్రకటించారు.

Last Updated : Jun 24, 2020, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details