నిమ్స్ తరహాలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. ఆసుపత్రిలో కోటి ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన అపరేషన్ థియేటర్లను ఆయన ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. అన్ని విభాగాల్లో అధునాతనమైన చికిత్స సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్. సుధాకర్ పాల్గొన్నారు.
నిమ్స్ తరహాలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి...!
కర్నూలు ప్రభుత్వ ఆస్పుత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి