కర్నూలు జిల్లా మద్దికేరలో ఏటా దసరా సందర్భంగా గుర్రాల పార్వతి వేడుకలు ప్రత్యేకం. గ్రామాన్ని పాలించిన యాదవ రాజుల వంశస్థులు దసరా పండుగ రోజున గుర్రాలపై సంప్రదాయ దుస్తుల్లో మందీ మార్బలం వెంటరాగా ఊరేగింపు నిర్వహిస్తారు. సమీపంలోని బొజ్జ నాయుడుపేట గ్రామాన్ని సందర్శించి అక్కడి భోగేశ్వర ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారు. అనంతరం మూడు వర్గాలవారు గుర్రాల పరుగు పందెం పోటీలను నిర్వహిస్తారు. ఈ వేడుకను తిలకించేందుకు వేలాదిగా ప్రజలు తరలివస్తారు.
మద్దికేరలో ఘనంగా గుర్రాల పార్వేట ఉత్సవాలు - మద్దికేర గ్రామ దేవత మద్దమ్మ జాతర
రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా కర్నూలు జిల్లా మద్దికేరలో గుర్రాల పార్వేట ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఏటా దసరా ఉత్సవాల్లో భాగంగా గ్రామాన్ని పాలించిన యాదవ రాజులు మూడు వర్గాలుగా మారి గుర్రాల పరుగు పందెం పోటీలను నిర్వహిస్తారు. ఈ వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తారు.
![మద్దికేరలో ఘనంగా గుర్రాల పార్వేట ఉత్సవాలు మద్దికేరలో ఘనంగా గుర్రాల పార్వేట ఉత్సవాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6202211-910-6202211-1582655384610.jpg)
మద్దికేరలో ఘనంగా గుర్రాల పార్వేట ఉత్సవాలు
మద్దికేరలో ఘనంగా గుర్రాల పార్వేట ఉత్సవాలు
మద్దికేర గ్రామ దేవత మద్దమ్మ జాతర ఈ ప్రాంతంలో ప్రత్యేకం. ఆరు వందల సంవత్సరాల క్రితమే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఆమెకు ఆలయం నిర్మించి అక్కడే ఉన్న మద్ది వృక్షాన్ని విగ్రహంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని పెద్ద విగ్రాహాన్ని ఇక్కడ నిర్మించారు.