కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని పీ చింతకుంట పొలాల్లో పనిచేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. 30 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్సు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కూలీలను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా 30 మంది కూలీలు ఆసుపత్రికి వచ్చిన కారణంగా.. చికిత్స అందించేందుకు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుపత్రి అధికారులు వెంటనే స్పందించి, అదనపు సిబ్బందిని రప్పించి వైద్యం అందించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కూలీలు ఆళ్లగడ్డ పరిసర గ్రామాలకు చెందిన వారు.
తేనెటీగల దాడిలో 30 మంది కూలీలకు గాయాలు - పీ చింతకుంట తేనెటీగల దాడి
తేనెటీగల దాడిలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద 30 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
కూలీలపై తేనటీగలు దాడి