కర్నూలులో ఆయుర్వేద మందులు తయారు చేసే కేంద్రంపై విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. వీకర్ సెక్షన్ కాలనీలోని తయారీ కేంద్రంపై దాడి చేయగా... నిర్వాహకులు సమీపంలోని ఇళ్లల్లో ఉండే మహిళలతో మందులు తయారు చేయిస్తున్నట్లు గుర్తించారు. నిపుణులతో తయారు చేయించాల్సిన మందులను గృహిణిలతో చేయిస్తుండటంపై అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు.
గృహిణులతో.. ఆయుర్వేద మందుల తయారీ?? - kurnool
వారికి రోగుల ప్రాణాలంటే లెక్కేలేదు. నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సిన మందుల తయారీని నిర్లక్ష్యంగా సమీపంలోని గృహిణులతో చేయిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఆయుర్వేద ముందుల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడి చేయగా... ఇలాంటి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
గృహిణిలే నిపుణులు