లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా బయట తిరిగుతున్న ప్రజలకు కర్నూలులో హిజ్రాలు అవగాహన కల్పించారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు శిబిరం వద్ద వారు ప్ల కార్డులతో పోలీసులకు తోడుగా.. కరోనా ప్రభావాన్ని వివరించారు. ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటికి వచ్చి నిత్యావసర సరుకులను తీసుకెళ్లాలని వారు సూచించారు. మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటికి రావద్దని కోరారు.
కరోనాపై.. హిజ్రాల అవగాహన - hijras Awareness program on corona
లాక్డౌన్కు అందరూ సహకరించాలంటూ కర్నూలులో హిజ్రాలు ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీసులకు తోడుగా తమ వంతు సహాయం చేస్తామంటూ ముందుకు వచ్చారు.

కరోనాపై హిజ్రాల అవగాహన కార్యక్రమం