HC SUSPENDED SENIOR RESIDENCE RECRUITMENT NOTIFICATION : గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీనియర్ రెసిడెన్సి పోస్టుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. పోస్టుల భర్తీ నియామకంలో ప్రైవేటు కాలేజీల విద్యార్థుల్ని అనుమతించకపోవడంపై.. కర్నూలుకు చెందిన డాక్టర్ మేడం ఝాన్సీ రాణి, తదితరులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ జరిపింది.
సీనియర్ రెసిడెన్సి పోస్టుల నోటిఫికేషన్.. తాత్కాలికంగా సస్పెండ్ చేసిన హైకోర్టు - మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
Senior Residence Notification In Government Medical Colleges: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీనియర్ రెసిడెన్సి పోస్టుల నియామక నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నియామకంలో ప్రైవేటు కళాశాలల విద్యార్థులను అనుమతించలేదని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

నిబంధనలకు వ్యతిరేకంగా కేవలం ప్రభుత్వ కాలేజీల్లో చదివిన డాక్టర్లను మాత్రమే అనుమతించడాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏ కాలేజీలో మాస్టర్ డిగ్రీ చేసినా.. సీనియర్ రెసిడెన్సి పోస్ట్‌కు అర్హులేనని శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: