High Court lawyer suspicious death : కర్నూలు సమీపంలోని నన్నూరు టోల్గేట్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు హైకోర్టు న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారమందించారు.
అనుమానాస్పద స్థితిలో.. హైకోర్టు న్యాయవాది మృతి - కర్నూలు జిల్లా వార్తలు
High Court lawyer suspicious death : కర్నూలు జిల్లా నన్నూరు టోల్గేట్ సమీపంలో పొలంలో మృతదేహం ఉన్నట్లు.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు హైకోర్టు న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లుగా గుర్తించారు.
died
కర్నూలు నగరంలోని టెలికాం నగర్లో న్యాయవాది ఆవుల వెంకటేశ్వర్లు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 7న ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన అదృశ్యమైనట్లు.. కుటుంబ సభ్యులు మహానంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేడు నన్నూరు టోల్ గేటు సమీపంలోని పొలంలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం రాగా.. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఆరా తీశారు. మృతుడు వెంకటేశ్వర్లుగా గుర్తించి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:Student Died: ఉన్నత చదువు కోసం వెళ్లి.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి