ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హెచ్ఆర్సీ విషయంలో పూర్తి వివరాలు సమర్పించండి : హైకోర్టు - కర్నూల్లో హెచ్ఆర్సీ , లోకాయుక్త ఏర్పాటు వార్తలు

hc on hrc : కర్నూల్లో హెచ్ఆర్సీ ఏర్పాటు చేశాక ప్రజల నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయి... ఎన్ని పరిష్కరించారో పూర్తి వివరాలతో అఫిడవిట్ ధాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5 కు వాయిదా వేసింది.

high court
high court

By

Published : Jan 26, 2022, 5:04 AM IST

కర్నూల్లో మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేశాక ప్రజల నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయి... ఎన్ని పరిష్కరించారు , ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటు చేసిన యంత్రాంగం , మౌలిక సదుపాయాలు తదితర వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5 కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

కర్నూల్లో హెచ్ఆర్సీ , లోకాయుక్త ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు , హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసేందుకు సౌకర్యాల లేమిని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి . న్యాయవాది పొత్తూరు సురేష్ కుమార్ వాదనలు వినిపిస్తూ .. కర్నూల్లో ఏర్పాటైన హెచ్ఆర్సీ అతిథి గృహంలో నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఫిర్యాదులు చేసేందుకు ఆన్లైన్ విధానం లేదన్నారు. కేవలం భౌతికంగా , పోస్టు ద్వారా ఫిర్యాదులు పంపాల్సి వస్తోందన్నారు. ఫోన్ నంబర్ , వెబ్సైట్ నిర్వహించడం లేదన్నారు. మరో పిటిషనర్ తరఫు న్యాయవాది డీ ఎస్ ఎన్వీ ప్రసాద్ బాబు వాదిస్తూ.. లోకాయుక్త పరిస్థితి అంతేదన్నారు. విజయవాడలో ఏర్పాటుకు కోట్ల రూపాయలు వెచ్చించారన్నారు. భవనాన్ని సిద్ధం చేశారన్నారు. చివరికి కర్నూల్లో ఏర్పాటు చేశారన్నారు. అక్కడ ఏర్పాటు చట్ట విరుద్ధం అన్నారు. న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. హెచ్ఆర్సీ విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చదవండి

లోకాయుక్త, హెచ్​ఆర్​సీ కార్యాలయం కోసం భవనాల పరిశీలన

ABOUT THE AUTHOR

...view details