కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి కె.ఎల్.ప్రభాకర్ రావుపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేసు నమోదు చేసి నోటీసు జారీచేయాలని హైకోర్టు రిజిస్ట్రీకి స్పష్టంచేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ డీపీవో ఓ సర్పంచ్ చెక్ పవరను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చెక్ పవర్ ను రద్దు చేస్తూ డీపీవో ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
HC: కర్నూలు డీపీవోపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించండి: హైకోర్టు - cancellation of check power
15:47 September 03
సర్పంచి చెక్‌పవర్‌ను డీపీవో రద్దు చేయడంపై హైకోర్టు ఆగ్రహం
చెక్ పవర్ ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సింగవరం గ్రామ సర్పంచ్ కె.నాగేంద్ర హైకోర్టులో వ్యాజ్యం వేశారు. న్యాయవాది బాలాజీ వాదనలు వినిపిస్తూ.. గ్రామ సచివాలయ ఏర్పాటును గతంలో హైకోర్టు నిలుపుదల చేసిందన్నారు. ఆ సచివాలయానికి నిధులు విడుదల కోసం స్థానిక అధికార పార్టీ నేతలు, పంచాయతీ కార్యదర్శి కలిసి సర్పంచ్ పై ఒత్తిడి చేస్తున్నారన్నారు. వారి అభ్యర్థనను తిరస్కరించడంతో చెక్ పవర్ ను రద్దు చేశారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి ద్వారా నిధులు డ్రా చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి డీపీవోపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి