కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర దంపతులు శనివారం రాత్రి దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం మరోసారి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ మహాద్వారం వద్ద హైకోర్టు సీజేకు అర్చకులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు.
శ్రీశైలం మల్లన్న సేవలో హైకోర్టు సీజే - Srisailam news
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర దంపతులు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు.
![శ్రీశైలం మల్లన్న సేవలో హైకోర్టు సీజే హైకోర్టు సీజే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14847654-1020-14847654-1648337254682.jpg)
శ్రీశైలంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన ఆమెకు ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం ఈవో ఎస్. లవన్న, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ తమిళసై మహా మంగళహారతి సేవలో పాల్గొని శ్రీ స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించుకున్నారు.అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గవర్నర్‌కు అర్చకులు వేదశీర్వదం పలుకగా, కలెక్టర్ కోటేశ్వరరావు, ఈవో లవన్న స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. దర్శనానికి వస్తున్న సమయంలో క్యూలైన్లలో భక్తులను తనకోసం ఆపవద్దని గవర్నర్ తమిళసై దేవస్థానం అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి:బస్సులో భోంచేద్దాం రండి..