ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

COTTON PRICE : పత్తి రైతు "ధర"హాసం.. ఆధోనిలో రికార్డు ధర! - ADHONI MARKET

కర్నూలు జిల్లా ఆధోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తికి రికార్డ్ స్థాయి ధర లభించింది. ఇతర రాష్ట్రాలతో పోలీస్తే ఆధోనిలోనే ధర ఎక్కువగా ఉందని వ్యాపారస్థులు తెలిపారు. ధర పెరుగుదల పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

ఆదోనిలో రికార్డు స్థాయిలో ధర
ఆదోనిలో రికార్డు స్థాయిలో ధర

By

Published : Dec 29, 2021, 6:30 PM IST

కర్నూలు జిల్లా అధోని వ్యవసాయ మార్కెట్ యార్డులో.. పత్తికి ధర రికార్డు స్థాయి దక్కింది. వ్యవసాయ మార్కెట్ యార్డు చరిత్రలోనే.. ఈ ధర అధికమని వ్యాపారులు చెబుతున్నారు. క్వింటాల్ పత్తి ధర గరిష్ఠంగా 9,399 రూపాయలు పలికిందని చెప్పారు. కనిష్ఠంగా 6,900 రూపాయల ధర లభించిందని అన్నారు. ధర భారీగా పలకడంతో.. రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

దిగుబడులు తగ్గడం వల్ల పత్తికి మంచి డిమాండ్ ఏర్పడి, ధరలు పెరిగాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రాలతో ధరలతో పోలిస్తే.. రాష్ట్రంలోని ఆధోని మార్కెట్లోనే అత్యధిక ధరలు ఉన్నాయని వ్యాపారస్థులు అంటున్నారు.

ఇదీచదవండి :

ABOUT THE AUTHOR

...view details