కర్నూలులో వెంకీమామకు ఓటు - హీరో వెంకటేష్‌కు కర్నూలులో ఓటు
కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటరు జాబితాలో మహిళా ఓటరుకు బదులుగా సినీ నటుడు వెంకటేష్ చిత్రం ప్రచురితమయ్యింది. కర్నూలు నగరంలో 31వ వార్డులోని ఓ మహిళా ఓటరు వివరాల దగ్గర నటుడు వెంకటేష్ ఫోటో ఉంది. ఇది ఒక్కటే కాదు... ఇటువంటి తప్పులు చాలానే ఉన్నాయని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లకుండా సరి చేస్తామని నగర పాలక సంస్థ అధికారులు తెలిపారు.
హీరో వెంకటేష్‌కు కర్నూలులో ఓటు