ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలానికి స్థిరంగా వరద.. 842.4 అడుగులకు చేరిన నీటిమట్టం - joorala water to srisailam project news

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 42,448 క్యూసెక్కులకు పైగా నీరు చేరుతోంది.

water flow in srisailam dam
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

By

Published : Jul 19, 2020, 4:25 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 42,448 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటిమట్టం 842.4 అడుగులుగా ఉంది.

జలాశయ నీటినిల్వ 65.59 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని అధికారులు కొనసాగిస్తున్నారు. 25,427 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details