వర్షాల కారణంగా కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహ ధాటికి కుందూ నది వద్ద ఉన్న వంతెన మునిగి రాకపోకలకు వీలు లేకుండా పోయింది. నంద్యాల నుంచి నందమూరి నగర్, వైఎస్ నగర్, ఎస్సార్బీసీ కాలనీ, పులిమద్ది, మునగాల, రాయమలుపురం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతాల ప్రజలు మరో మార్గం వైపు వెళ్లాలని అధికారులు సూచించారు.
కుందూ ఉగ్రరూపానికి నీట మునిగిన వంతెన - kunool district kundu river latest news update
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి ప్రవాహం ధాటికి వంతెనలు మునిగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
కుందూ నదికి భారీగా వరద నీరు.. నీట మునిగిన వంతెన