కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గ్రామీణ రహదారులు కొట్టుకు పోయాయి. గ్రామాల మధ్య ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.
వంకలపై నిర్మించిన వంతెనలు కొట్టుకుపోయాయి. రహదారులన్నీ కోతకు గురయ్యాయి. మండలంలోని మాధవరం, సూగూరు, కాళ్లుదేవకుంట, బూదూరు, వగరూరు, తిమ్మాపురంతో పాటు మరికొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.