కర్నూలు జిల్లాలో గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ప్యాపిలి మండలంలో 125 m.m వర్షపాతం నమోదయింది. వరద ధాటికి నల్లమేకలపల్లి నుంచి రాంపురం, మామిళ్లపల్లి గ్రామాలకు వెళ్లే రహదారి కోతకు గురయింది. ఈ గ్రామాల ప్రజలు ప్యాపిలి, డోన్ కు వెళ్లాలంటే చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తెగిన రహదారిని చూడటానికి ఏ ఒక్క అధికారి రాలేదని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
'భారీ వర్షానికి తెగిన నల్లమేకపలపల్లి రహదారి' - floods in kurnool
కర్నూలు జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు ప్యాపిలి మండలంలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించాయి. నల్లమేకలపల్లి నుంచి రాంపురం, మామిళ్లపల్లి గ్రామాలకు వెళ్లే రహదారి కోతకు గురి కావటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షానికి తెగిన నల్లమేకపలపల్లి రహదారి