ప్రకాశం జిల్లాలో గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకు మంగమూరు-ఒంగోలు మధ్య ఉన్న నల్లవాగు పొంగుతోంది.రహదారిపైనే నీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయమేర్పడింది.కూలి పనులకు వెళ్లాలంటే భయంతో వాగు దాటాల్సి వస్తోందని... జడిసి వెళ్లకుంటే... పూటగడవదని గ్రామస్థులు చెబుతున్నారు.గత50 ఏళ్లుగానల్లవాగుతో ఇబ్బంది పడుతున్నామని..వంతెన నిర్మించాలని కోరుతున్నా పట్టించుకున్న వారు లేరని వాపోతున్నారు.
జోరు వానతో జనజీవనం అస్థవ్యస్తం - కర్నూలులో వాతావరణం తాజా వార్తలు
గత వారం నుంచి కురస్తున్న వర్షాలతో ప్రకాశం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు వంకలు పొంగుతున్నాయి. పంటలు పనికిరాకుండాపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది.
heavy-rains-in-kurnool
చీరాలలో,పర్చూరు నియోజకవర్గాల్లో వర్షాలకు జనజీవనం అస్థవ్యస్తమైంది.లోతట్టు ప్రాంతాలు,రహదార్లు జలమయమయ్యాయి.పంటలు నీట మునిగాయి.ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.ఇంకొల్లు మండలం దుద్దుకూరు వద్ద ఊరవాగు ప్రమాదస్థాయిలో పొంగుతోంది.ఇంకొల్లు-ఒంగొలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.