కర్నూలు జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు ఉద్ధృతంగా కురుస్తున్నాయి. ఆళ్లగడ్డ, చాగలమర్రి, పాణ్యం, డోన్, కొత్తపల్లి, అవుకు, ఆత్మకూరు, మహానంది, శిరివెళ్ల మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆళ్లగడ్డ మండలంలో వక్కిలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపల్లి మండలంలో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
డోన్ పట్టణంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ చెట్టు కూలింది. విద్యుత్ తీగలు తెగిపడి... సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాణ్యం మండలంలో కుందూ నది, చాగలమర్రి మండలంలో వక్కిలేరు, భవనాశి వాగులు ప్రమాదకరంగా మారాయి. ఆత్మకూరు పట్టణంలో పోస్టాఫీసులోకి నీరు చేరింది. మహానందిలో ఈవో క్వార్టర్ వెనుక భారీ వృక్షం నేలకొరిగింది. జిల్లాలో వర్షాలు, వరద సహాయక చర్యలపై కలెక్టర్ వీరపాండియన్ టెలీ కాన్ఫరెన్స్ చేశారు. అధికారులను అప్రమత్తం చేశారు.
ఉద్ధృతంగా పాలేరు వాగు..