కర్నూలు నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ అన్నారు. గాజుల దిన్నె ప్రాజెక్టులో గేట్లు ఎత్తడంతో వరద నీరు హంద్రీ నదీకి పోటెత్తింది. ఉదయం నుంచి వరద జలాలు వస్తుండగా... రాత్రి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్తబస్టాండ్కు వెళ్లే ప్రదాన రహదారుల పైకి నీరు రావడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.
కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు.. నిలిచిన రాకపోకలు - కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు
కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో రోడ్లన్నీ జలమయం కాగా..రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వీర పాండియన్ సూచించారు.
కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు