రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీగా కురిసిన వర్షానికి పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో రాత్రంతా జాగారం ఉన్నారు. నీటిని బయటకు పంపేందుకు కాలనీవాసులు తిప్పలు పడ్డారు.
ఇళ్లలోకి చేరిన వరద నీరు..ప్రజలకు తప్పని ఇబ్బందులు - కర్నూలు జిల్లాలో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు
వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
![ఇళ్లలోకి చేరిన వరద నీరు..ప్రజలకు తప్పని ఇబ్బందులు Heavy rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9155879-632-9155879-1602566320489.jpg)
వరద నీరు