నివర్ తుపాను కారణంగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు ఎక్కువగా ఉండటంతో పంట దెబ్బ తింటుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మార్కెట్ యార్డులో ఆరబోసిన వడ్లు, మొక్కజొన్నలను తడవకుండా రైతులు చర్యలు చేపట్టారు.
నంద్యాలను వణికిస్తున్న నివర్ తుపాను - నంద్యాల తాజా వార్తలు
నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నంద్యాలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈదురు గాలులు కూడా అధికం అవ్వటంతో పంట దెబ్బ తింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నంద్యాలలో నివర్ తుఫాను ప్రభావం