కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై మోకాళ్ళ లోతు నీరు చేరటంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. తిరుమల నగర్, శ్రీనివాస్ భవన్ కూడలి పూర్తిగా జలమయమైంది. లంగర్ బావి వీధి, కంచిగారి వీధి, గౌలి పెట్, పెద్ద మార్కెట్, రైతు బజార్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. కొత్త బస్టాండ్ దగ్గర అవుదూడ వంక పొంగి పొర్లుతోంది.
ఆదోనిలో కుండపోత వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - ఆదోనిలో భారీ వర్షం తాజా వార్తలు
ఆదోనిలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. కొత్త బస్టాండ్ దగ్గర ఆవుదూడ వంక పొంగిపొర్లింది.
పూర్తిగా జలమయమైన ఆదోని ప్రధాన రోడ్లు