భారీ వర్షాల కారణంగా... కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నంద్యాల సమీపంలో కుందూ నది, మద్దిలేరు వాగు, చామ కాలువలో నీటి ఉధృతి కొనసాగుతుంది. నంద్యాల హరిజన పేట వద్ద మద్దిలేరుపై నిర్మించిన వంతెన మునిగి పీవీ.నగర్, భీమవరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హరిజనవాడలోని పలు ఇళ్ళలోకి నీరు చేరింది. పట్టణంలో చామకాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది.
ఉరిమిన మేఘం.. కురిసిన వర్షం.. నేలంతా జలం - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగాయి.
కర్నూలు జిల్లాలో భారీ వర్షం