కోడుమూరులో భారీ వర్షం - heavy rains news in kurnool district
కర్నూలు జిల్లా కోడుమూరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. స్థానిక పాత బస్టాండ్లో శతాబ్దం కాలంగా ఉన్న భారీ వేప చెట్టు కూలిపోయింది.
కోడుమూరులో భారీ వర్షం
కర్నూలు జిల్లా కోడుమూరులో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని పాత బస్టాండ్లో 100 ఏళ్లకు పైగా ఉన్న వేప చెట్టు కూలి గ్రామపంచాయతీ భవనాలపై పడింది. పలుచోట్ల కరెంట్ తీగలు తెగటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని పెద్ద బోయగిరిలోని సుంకులమ్మ ఆలయం సమీపంలో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో రోడ్లపైకి నీరు చేరటంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు.