ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న వాగులు, వంకలు

గత రెండు రోజులుగా కురిస్తున్న భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆళ్లగడ్డలో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

heavy rain
heavy rain

By

Published : Jun 12, 2020, 11:27 AM IST

కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆళ్లగడ్డ పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నెల 10, 11 తేదీల్లో వరసగా సగటున 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నియోజకవర్గ పరిధిలోని ఒక్కిలేరువాగు, రాళ్లవాగు ,నల్ల వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. చాగలమర్రి పరిధిలో ఒక్కిలేరు ఉధృతంగా ప్రవహించడంతో.. సమీపంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే మంచి వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు కొనసాగించేందుకు ఈ వర్షం ఎంతో సహాయపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details