కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని కల్లూరు ప్రాంతంలో వక్కెర వాగు ఉగ్రరూపం దాల్చి, ప్రమాదకరంగా ప్రవహసిస్తుంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపైన సైతం నీరు ప్రవహిస్తుండటంతో.. ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గాజులదిన్నె జలాశయం పూర్తిగా నిండిపోయింది. దీంతో అన్ని గేట్లు ఎత్తి 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం నీరు హంద్రీ నదిలోకి చేరటంతో నది వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోడుమూరు, దేవనకొండ మండలాల్లోని నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలులో భారీ వర్షాలు - కర్నూలు భారీ వర్షాలు వార్తలు
కర్నూలు జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉగ్రరూపం దాల్చి.. ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రజలు వరద ఉద్ధృతి ఎక్కువటంతో తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలులో భారీ వర్షాలు