కర్నూలు జిల్లాలో పలు చోట్ల రెండో డోసు టీకా కోసం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. రెండో డోసు టీకా వేస్తున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా వాక్సిన్ కేంద్రాలకు ప్రజలు చేరుకున్నారు. కర్నూలు ప్రభుత్వ ప్రాంతీయ కంటి వైద్యశాలలో కొద్దిసేపటికే టీకాలు అయిపోయాయని చెప్పటంతో జనం వెనుదిరిగారు.
వాక్సిన్ కోసం వచ్చిన వారికి కనీస సదుపాయలు ఏర్పాటు చేయలేదని, అందరూ గుంపులు గుంపులుగా ఉండడంతో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని టీకా కోసం వచ్చిన ప్రజలు ఆందోళన చెందారు.