ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం - karnataka liquor caught in kurnool

ఎనభై వేల రూపాయల విలువైన కర్ణాటక మద్యాన్ని కర్నూలు జిల్లా ఇస్వి పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆ సరకును విక్రయిస్తున్న వ్యాపారులనూ అదుపులోకి తీసుకున్నామన్నారు.

karnataka liquor
పోలీసులు స్వాధీనం చేసుకున్న కర్ణాటక మద్యం

By

Published : Nov 5, 2020, 10:56 PM IST

కర్ణాటక మద్యాన్ని.. కర్నూలు జిల్లా ఆదోనిలోని ఇస్వి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సరకును రాష్ట్రంలో అమ్ముతున్న.. ఇద్దరు ఆ రాష్ట్ర వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

నిందితుల నుంచి 1,094 మద్యం సీసాలు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వినోద్​ కుమార్​ తెలిపారు. పట్టుకున్న సరకు విలువ సుమారు 80 వేల రూపాయలు ఉంటుందని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details