కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కుందూనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నల్లమలలో కురిసిన భారీ వర్షాలకు నదిలోకి వరద చేరి వంతెన మునిగింది. వైఎస్ నగర్, నందమూరినగర్, పులిమద్ది, రాయమలుపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఉద్ధృతంగా కుందూ నది.. మునిగిన వంతెన - ఉద్ధృతంగా కుందూనది
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కుందూ నది ఉద్ధృతి భారీగా పెరిగింది. నదిలోకి వరద చేరి వంతెన మునిగింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మునిగిన వంతెన
లోతట్టు ప్రాంతాలకు వరద
మద్దులేరు వాగు ఉద్ధృతి భారీగా పెరిగింది. పి.వి. నగర్, భీమవరం గ్రామాలకు వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మహానంది వద్ద పాలేరు వాగు పొంగి పొర్లుతోంది. ఈ నీరు నంద్యాల చామ కాలువకు చేరుతోంది.
ఇదీ చదవండి: ఉరుములు, మెరుపులతో వర్షాలు... రైతుల ఆందోళన