శ్రీశైలం జలాశయం.. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 40,259 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,490 క్యూసెక్కులు, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ద్వారా 1,688 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 24,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి 878.20 అడుగుల నీటి మట్టం చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా 179.12 టీఎంసీల నీరు చేరింది. జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. గేట్లు ఎత్తే అవకాశం! - శ్రీశైలానికి వరదలు న్యూస్
ఎగువన కురుస్తున్న వర్షాలతో.. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి ఇన్ ఫ్లో 3,45,530 క్యూసెక్కులుగా ఉంది.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. గేట్లు ఎత్తే అవకాశం!