శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా నీరు నాగార్జున సాగర్ వైపునకు ఉరకలు వేస్తోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 3 లక్షల 60వేల 936 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. వరద కొనసాగుతుండడంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లను 15 అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 77,427 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులు, నీటి నిల్వ 213.9193 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ అదనంగా 26,427 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు పంపుతున్నారు.
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు భారీగా వరద - శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు భారీగా వరద
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం భారీగా వస్తోంది.
నాగార్జునసాగర్‌కు భారీగా వరద