కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 2.27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఫలితంగా అధికారులు... జలాశయం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,54,614 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉండగా... 214.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద... 8 గేట్లు ఎత్తి నీటి విడుదల
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 2.27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా... జలాశయం 8 గేట్లు ఎత్తి 2,54 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎనిమిది గేట్ల ద్వారా నీటి విడుదల
Last Updated : Aug 26, 2020, 8:10 PM IST