ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంజీవయ్య సాగర్​కు భారీగా వరదనీరు.. - కర్నూలులో పొంగిపొర్లుతున్న వాగులు వార్తలు

కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాజులదిన్నె ప్రాజెక్టు (సంజీవయ్య సాగర్)కు భారీగా నీరు వచ్చి చేరుతోంది.

Heavy flood water to Sanjeevayya Sagar in karnool district
కర్నూలు జిల్లాలో పొంగుతున్న వాగులు

By

Published : Jul 25, 2020, 10:09 AM IST

కర్నూలు జిల్లాలో పొంగుతున్న వాగులు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. వక్కెరవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టు (సంజీవయ్య సాగర్)కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే జలాశయంలోకి 60 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరగా.... రిజర్వాయర్​లోని 4 గేట్లు ఎత్తి దిగువకు తుంగభద్ర నదిలోకి 40 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తీర ప్రాంతం గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గంజహల్లి వద్ద వంక ఉధ్దృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details