శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి మళ్లీ వరద వస్తోంది. లక్షా 46 వేల 936 క్యూసెక్కులు నీరు ప్రాజెక్టుకు చేరుతోంది. జలాశయం గేటును 10 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 884.80 అడుగుల నీరు ఉంది. కుడి, ఎడమ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. స్పిల్ వే, విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు 93వేల 784 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని అధికారులు వెల్లడించారు.
srisailam dam: శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి.. దిగువకు నీరు విడుదల - Water level in Srisailam reservoir
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద వచ్చి చేరుతోంది. ఈ కారణంగా జలాశయం గేటు 10 అడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 884.80 అడుగుల నీరు ఉంది.
శ్రీశైలం జలాశయం