శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 3.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్ జలాశయానికి నీటిని విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 1.67 లక్షల క్యూసెక్కులు వరద నీరును అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగుల మేర ఉంది. అలాగే పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.40 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది.
శ్రీశైలం జలాశయానికి.. 3.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - undefined
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుంది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
TAGGED:
srisailam reservoir